Friday, December 9, 2011

వార్మప్

కార్డియో వర్కౌటు చేసేందుకు మేము ఉపయోగంచే వస్తువులగురించి వ్రాస్తాను. వారానికి నాల్రోజులు, రోజుకి అఱగంటా చొప్పున కార్డియో సెషన్ ఉంటుంది. మాచేత కార్డియో చేయించే గురువుగారి పేరు స్కాట్ సాల్ట్స్. పెద్దాయన. కార్డియో ఓ సరదా కార్యక్రమంలా చేయిస్తాడు. అందర్నీ పూర్తిగా మునిగిపోయేలా చేస్తాడు. చేయిస్తాడు. సరదా మనిషి. సెషనుకి లాక్కెళ్ళాలా ఉంటుంది అతని పద్ధతి. అబ్బా ఈరోజు వెళ్ళాలా అనే నిరాశా నిస్పృహలు ఏమాత్రం కల్గనీకుండా అలాంటి ఆలోచనలు రానీకుండా ఉండేలా ఉంటుంది అతని ధోరణి.
కార్డియో వ్యాయామం అంటే ఏవిటీ?
మామూలు స్థితిలో మనిషి గుండె 60-70 సార్లు కొట్టుకుంటే, సాధారణ స్థాయికన్నా కొన్ని రెట్లు ఎక్కువసార్లు కొట్టుకునే స్థితికి వెళ్ళేలా వ్యాయామం చేయటాన్నే కార్డియో వ్యాయామం అంటారు.
Exercise_zones.png
[పై బొమ్మ వికీ నుండి]
మరి అన్ని రెట్లు పెరగాలంటే ఏంచేయాలీ?
పరుగెత్తటమో లేక మెట్లెక్కటమో లేక బరువులెత్తటమో లేక వేగంగా నడవటమో లాంటివి చేయాలి.
మా గురువు ఇలాంటివి అనేకానేక వ్యాయామాలను కలిపి ఓ వర్కౌట్ లాగా రూపిందించాడు. ఒకరోజు ఒకరకం చేస్తే మరోరోజు మరోరకం చేయిస్తుంటాడు.
మ వర్కుటులోని మొట్టమొదటి ఘట్టం ఇలా మొదలౌతుంది.
పాతిక జంపింగ్ జాక్స్ - ముఫై సెకనులలో
[జమ్పింగ్ జాక్స్ అంటే -
http://en.wikipedia.org/wiki/Jumping_Jack
ఉదాహరణ వీడియో
]

జంపింగ్ జాక్స్ అయ్యాక చేసేది ఈ సైకిలు మీద ముఫై సెకనుల స్ప్రింట్. సైకులు తొక్కటం అంటే అలా నింపాదిగా కాదు, స్ప్రింట్ అన్నమాట.

అయ్యాక ముఫై సెకనులు పుష్ అప్స్
అయ్యాక మళ్ళీ సైకిల్
అయ్యాక ముఫై సెకనులు సిట్ అప్స్
అయ్యాక మళ్ళీ సైకిల్
అయ్యాక ముఫై సెకనులు ప్రిజనర్ స్క్వాట్స్
[ప్రిజనర్ స్క్వాట్ అంటే ఏంలేదు, మన గుంజిళ్ళే, ఐతే, చేతులు తల వెనుక పెట్టుకుని చేయాలి
ఉదాహరణకు
]
అయ్యాక మళ్ళీ సైకిలు
అయ్యాక లెగ్ లాంజెస్
[leg lounges
]

మొత్తం మీద ఇలా
జంపింగ్ జాక్స్ + సైకిల్ + పుష అప్స్ + సైకిల్ + సిట్ అప్స్ + సైకిల్ + ప్రిజనర్ స్క్వాట్స్ + సైకిల్ + లెగ్ లాంజెస్
ఒక్కోటి ముఫై సెకనులు
పై రొటీన్ అయ్యేప్పటికి నాలుగున్నర నిమిషాలు. ఇవి అయ్యేపాటికి వార్మప్ స్థితి దాటిపోతుంది.

Saturday, December 3, 2011

కార్డియో కిక్ బాక్సింగ్

ఇక్కడ నా కార్డియో కిక్ బాక్సింగ్ అనుభవాలు, నేను చేసే రొటీన్స్ లాంటివి వ్రాద్దామని నా ఆలోచన